తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ రానుంది.బీసీల కోసం మరో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నామని ఆర్ కృష్ణయ్య ప్రకటన చేశారు.త్వరలో అన్ని కుల సంఘాలతో మీటింగ్ ఏర్పాటు చేస్తానని, ఏకాభిప్రాయం వస్తే పార్టీపై ప్రకటన చేస్తారని తెలిపారు.బీసీలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేస్తున్నాయని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు.బీసీల కోసం కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయని ఆర్ కృష్ణయ్య గుర్తు చేశారు.రాజ్యాధికారం వస్తే బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా ఆర్.కృష్ణయ్య 1994 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు.2014లో ఆయన ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి ముద్ద గోని రామ్మోహన్ గౌడ్ పై 12525 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారి చట్టసభల్లో కి అడుగుపెట్టారు.2018 లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.మరి ఈ కొత్త రాజకీయ పార్టీ తెలంగాణలో ఎంతవరకు రాణిస్తుందో వేచి చూడాలి.