40 ఏళ్ల క్రితం నేను పూలు, పాలు అమ్మాను: మంత్రి మల్లారెడ్డి

-

40 ఏళ్ల క్రితం నేను పూలు, పాలు అమ్మానని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ ప్రభుత్వం తరుపున మేడే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ… దేశానికి సంపద సృష్టించే కార్మికుల కోసం మేడే జరుపుకుంటున్నామని… అన్ని రాష్ట్రాలకు భిన్నంగా మన రాష్ట్రంలో వేడుకలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఉత్తమ సంఘాలు, కార్మికులకు అవార్డ్స్ ఇస్తున్నాం.. లక్షలాది కార్మికులు పని చేస్తున్నారన్నారు.

mallareddy
mallareddy

భవన నిర్మాణ రంగంలో దాదాపు 30 లక్షల మంది పని చేస్తున్నాం..ఇతర రంగాల్లోని కార్మికుల కోసం కార్మిక శాఖ ఎన్నో కార్యక్రమాలు, పథకాలు చేపట్టిందని గుర్తు చేశారు. కోవిడ్ టైంలో కార్మికులంతా చాలా ఇబ్బందులు పడ్డారు.. వారికి ముఖ్యమంత్రి గారు ఆదుకున్నారని… కరోనా టైంలో ఏ రాష్ట్రం కార్మికులను ఆదుకోలేదు, ఒక్క తెలంగాణ తప్ప అని ప్రశ్నించారు. ఒకప్పుడు పరిశ్రమలకు కరెంట్ ఉండేది కానీ, ఇప్పుడు 24 గంటల పవర్ ఉందని.. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పని కోసం మన దగ్గరకి వస్తున్నారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news