మీ కెరీర్ లో ఎదగలేకపోతున్నారా..? అయితే మీ గ్రోత్ ఆపుతున్నవి ఇవే..!

-

కొంత మంది నచ్చిన కెరియర్ ని ఎంచుకునప్పటికే అందులో సక్సెస్ అవ్వలేక పోతుంటారు. నిజానికి అందరూ కెరియర్లో సక్సెస్ అవ్వాలని లేదు. అయితే గ్రోత్ లేదంటే కొన్ని విషయాల్లో మీరు తప్పులు చేస్తున్నారని తెలుసుకోవాలి. వాటిని కనుక మీరు సరి చేస్తున్నారంటే తప్పకుండా మీ కెరీర్ లో గ్రోత్ అనేది వస్తుంది మీ కెరీర్లో కూడా గ్రోత్ లేనట్లయితే ఈ తప్పులు చేస్తున్నారేమో చూసి వాటిని సరి చేసుకోవడం మంచిది. మరి ఎటువంటి ఆలస్యం లేకుండా దీని కోసం చూద్దాం.

 

రూల్స్ అండ్ రెగ్యులేషన్స్:

మీరు ప్రతి విషయంలో కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. రూల్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేయకుండా ఫాలో అవుతూ ఉండాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి కట్టుబడి ఉంటే కచ్చితంగా మీరు కెరియర్లో ముందుకు వెళ్ళగలరు. వాటిని బ్రేక్ చేశారంటే కెరియర్ కి నష్టం కలిగే అవకాశం ఉంటుంది.

అప్డేట్ లో ఉండండి:

ఎప్పుడూ కూడా మీ పని మీరు చేసుకుని వెళ్లిపోవడం.. మీ బాస్ ఇచ్చిన వాటిని చేసుకుంటూ వెళ్ళి పోవడం కంటే కూడా కొత్తదనాన్ని చూపించండి. మీరు కనుక కొత్తదనాన్ని చూపిస్తే మిమ్మల్ని మెచ్చుకుంటారు. పైగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి కూడా అవుతుంది.

టీం వర్క్ చాలా ముఖ్యం:

ఎవరి పని వారిదే నాకెందుకు అందరి పని అని అనుకోవద్దు. టీం వర్క్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి పైగా మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసుకోవడానికి టీం వర్క్ సహాయపడుతుంది. మిమ్మల్ని పైస్థాయికి త్వరగా తీసుకువెళుతుంది.

కీలక నిర్ణయాలు తీసుకోవాలి:

మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేక పోతే ఎప్పటికీ మీరు పైకి ఎదగలేరు. కాబట్టి మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకుని ఎత్తుకు ఎదగాలి. అప్పుడు కచ్చితంగా మీరు పైకి వెళ్లగలరు లేదంటే అంతటితో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

మీకు మీరుగా నేర్చుకోండి:

ప్రతిరోజు మీరు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండండి. ఇలా చేయడం వల్ల మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. దీంతో మీ గ్రోత్ కూడా ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఫాలో అయితే ఖచ్చితంగా కెరియర్ లో సక్సెస్ ని అందుకుని పైకి వెళ్తారు.

Read more RELATED
Recommended to you

Latest news