రోజురోజుకూ నిత్యావసరాల ధరలు పెరుగుతున్న క్రమంలో సామాన్య ప్రజలు అల్లాడుతున్నారు. దసరా పండుగ నుంచే క్రమంగా నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. పండుగలు అయిపోయాక కూడా ధరలు పెరుగుతుండటంతో సామాన్యుడికి జీవనం భారంగా మారుతోంది. ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
సబ్సిడీ ధరలకే నిత్యావసరాలు అందించాలని నిర్ణయించింది. లీటర్ పామాయిల్ రూ.110, కేజీ కందిపప్పు రూ.67, అరకేజీ చక్కెర రూ.16 కే అందించాలని మంత్రులు నాదెళ్ల మనోహర్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడుతో కూడిన కమిటీ నిర్ణయించింది. రైతు బజార్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2200 రిటైల్ ఔట్ లెట్ల ద్వారా సరుకులు విక్రయించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నిర్ణయంతో సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.