కొనసాగుతున్న ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలు

-

కర్నూలు జిల్లా మంత్రాలయంలో శుక్రవారం ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలు విజయవంతంగా జరుగుతున్నాయి. ఆదివారంతో ముగియనున్న ఈ సమావేశాల్లో  దేశంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పార్టీల పాత్ర గురించి ప్రధానంగా చర్చిస్తున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ కు చెందిన 200 మందికి పైగ ప్రతినిధులు పాల్గొన్న ఈ మీటింగ్ లో దేశ ఆర్థిక, సేవా, విద్యా, వైద్య రంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలు , రానున్న ఎన్నికల్లో విజయం దిశగా అనుసరించాల్సిన వ్యూహాలను గురించి చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఏటా జరిగే జాతీయ సమావేశాల్లో భాగంగానే ఈ సారి కర్నూలులో జరుపుతున్నట్లు అధికారిక వర్గాలు తెలుపుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news