‘అదుగో’ బంటి ఫస్ట్ లుక్

-

నటుడిగా చేస్తూనే దర్శకత్వం కోరిక తీర్చుకుంటున్న వారిలో రవిబాబు ఒకరు. అతని విషయంలో పార్ట్ టైం నటన ఫుల్ టైం డైరక్షన్ అన్నట్టు ఉంటుంది. తను తీసే సినిమాలు కూడా కొత్తగా ఉండటంతో ప్రేక్షకులు రవి బాబు సినిమా అనగానే ఆసక్తి చూపిస్తారు. ఇక లేటెస్ట్ గా పిగ్లెట్ (పందిపిల్ల) లీడ్ రోల్ గా అదుగో సినిమా చేస్తున్నాడు రవిబాబు. ఈ సినిమాలో పంది పాత్ర పేరు బంటి అని పెట్టారు.

ఇక సినిమా ఫస్ట్ లుక్ పోస్ట్ర్ లో ఆ విషయాన్నే చెబుతూ మై నేం ఈజ్ బంటి అని పోస్టర్ వదిలారు. యూనివర్సల్ కాన్సెప్ట్ కాబట్టి ఈ సినిమా మిగతా భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తెలుగులో అదుగో అని టైటిల్ పెట్టగా తమిళ, హింది భాషల్లో బంటి అనే టైటిల్ తో సినిమా రిలీజ్ అవుతుందట. అప్పుడెప్పుడే బంటిని పరిచయం చేసి కనిపించకుండా పోయిన రవిబాబు ఫైనల్ గా బంటి అదేనండి అదుగో ఫస్ట్ లుక్ తో సర్ ప్రైజ్ ఇచ్చాడు. రాజమౌళి ఈగతో ఎక్స్ పెరిమెంట్ చేస్తే రవిబాబు పందితో ప్రయోగం చేశాడు.

మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. రవిబాబు దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు సురేష్ బాబు సపోర్ట్ దొరికింది. సినిమా సురేష్ ప్రొడక్షన్స్ ద్వారానే రిలీజ్ అవుతుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news