తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్..ఓటీటీ గేమ్ పదో వారంలోకి ఎంటరయింది. కంటెస్టెంట్స్ అందరూ జాగ్రత్తగా గేమ్ ఆడుతున్నారు. ఇక తొమ్మిదో వారం వీకెండ్ లో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ రావడంతో కంటెస్టెంట్స్ ఎమోషనల్ అయ్యారు. అయితే, షో లో మొదటి నుంచి బిందు మాధవి గేమ్ బాగా ఆడుతోంది. తన ఫోకస్ మొత్తం ఆట పైనే పెడుతోంది.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోనూ బిందు మాధవియే టైటిల్ విన్నర్ అనే ప్రచారం చాలా కాలం నుంచి జరుగుతోంది. ఈమెకు ఆడపులి అనే పేరు కూడా ఇచ్చారు. ఇక గేమ్ దగ్గరపడుతున్న టైంలో కంటెసటెంట్స్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు కూడా. కాగా, సోమవారం ఎపిసోడ్ లో బిందు మాధవి ప్రవర్తన ఒక రకంగా నెగెటివ్ అయిపోయింది.
నామినేషన్స్ టైంలో బిందు మాధవి ప్రవర్తించిన తీరును సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు , బీబీ లవర్స్ తప్పుబడుతున్నారు. గట్టి గట్టిగా అరుస్తూ దారుణంగా బిందు మాధవి ప్రవర్తించిన తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బిందు మాధవి అతిగా ప్రవర్తించిన నేపథ్యంలో సోషల్ మీడియాలో ‘‘ఎలిమినేట్ బిందుమాధవి’’(#Eliminate Bindu Madhavi) హ్యాష్‌ట్యాగ్ పేరిట వరుస ట్వీట్స్ చేశారు. దాంతో మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో సదరు హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది. ఈ హ్యాష్ ట్యాగ్ తో పాటు బిందు మాధవి హ్యాష్ ట్యాగ్ #BinduMadhavi కామెంట్ చేసి వరుస ట్వీట్స్ చేస్తున్నారు నెటిజన్లు. అలా బిందు మాధవి ఈ సీజన్ లో టాప్ ప్లేస్ నుంచి ఒక్కసారిగా వరస్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది.
అలా ఇప్పటి వరకు టైటిల్ రేసులో ఉన్న బిందు మాధవి ఒక్కసారిగా పాతాళంలోకి వెళ్లిపోయింది. అయితే, నెక్స్ట్ ఎపిసోడ్స్ లో తన ప్రవర్తన తీరును మార్చుకుని మళ్లీ ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేందుకు బిందు మాధవి తన వంతు ప్రయత్నాలు చేసే చాన్సెస్ మెండుగానే ఉన్నాయని బీబీ లవర్స్ అంటున్నారు. చూడాలి మరి..ఏం జరుగుతుందో..
Motham pre-planned nomination from #BindhuMadhavi
Eliminate Bindu Madhavi pic.twitter.com/AaCw8tjKne— Wierd_explorer1 (@Explorer1Wierd) May 3, 2022
From the first day I didn't likes her she behaves very worst she should be kicked out of the house
Eliminate Bindu Madhavi pic.twitter.com/LcoOhBrJmh— rajesh (@ujjwalsaaho3) May 3, 2022
Targeting someone on the personal aspects is worst from any contestants and she has been then worst in that
Eliminate Bindu Madhavi pic.twitter.com/TbCRt9m3Iz— Chandini (@LoveForChandini) May 3, 2022