ఛలో సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈమె మొదటి సినిమాతోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకుని తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాలో డీగ్లామర్ పాత్ర పోషించి క్యారెక్టర్లో లీనమైపోయి నటించినందుకు గాను.. ఓవర్నైట్ లోని నేషనల్ హీరోయిన్ గా చలామణి అవుతోంది. దీంతో ఈమె కోలీవుడ్లో విజయ్ సినిమాలో నటించే ఈ అవకాశాన్ని సంపాదించుకోగా.. బాలీవుడ్ రణబీర్ కపూర్ సినిమాలో కూడా అవకాశాన్ని అందుకుంది.తెలుగులో పాన్ ఇండియా మూవీ అయిన పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా తమిళ్ లో కూడా విజయ్ సరసన పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా పలు క్రేజీ ప్రాజెక్ట్ లను సొంతం చేసుకుంది రష్మిక. మలయాళంలో కూడా తన హవా కొనసాగించడానికి సిద్ధమవుతోంది. మలయాళంలో రష్మిక హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న సీతారామమ్ అనే సినిమాలో దుల్కర్ సల్మాన్ కి జోడీగా కాకుండా ఓ ముస్లిం యువతిగా ఈమె కనిపిస్తోంది. ఇక రష్మిక ఫ్యామిలీ మాన్ లో సమంత క్యారెక్టర్ ని చూసి ఇంప్రెస్ అయిందట. అందుకే సీతారామమ్ సినిమాల్లో కూడా ఈమె అలాంటి గెటప్ లో నటిస్తోంది అని అనుకుంటున్నారు..
సీతారామమ్ సినిమా లో రష్మిక ను అందరూ హీరోయిన్ అనుకుంటున్నారు కానీ డైరెక్టర్ మాట్లాడుతూ ఆమె అసలు హీరోయినే కాదు.. హీరో అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేశారు. ఒక కీలకమైన పాత్రలో రష్మిక ఆఫ్రీన్ అనే కాశ్మీర్ ముస్లిం అమ్మాయిగా మనకు కనిపిస్తోంది . అయితే ఈ పాత్రకు పెద్దగా డైలాగ్స్ లేకపోయినా కళ్లతోనే భావాలను పలికిస్తూ జడ్జ్ చేసే క్యారెక్టర్ లో హీరో కి సరిసమానంగా నటిస్తోంది అని తెలిపారు.