తగ్గిన Vivo Y21, Vivo Y21E ధరలు.. కొత్త ప్రైస్ ఇదే..!

-

Vivo Y21, Vivo Y21E స్మార్ట్ ఫోన్ ధరలను కంపెనీ తగ్గించింది. ముంబైకి చెందిన మహేష్ టెలికాం Vivo Y21, Vivo Y21e ధరలను తగ్గించినట్లు ప్రకటించింది. ఈ రెండూ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పుడు అవి మరింత సరసమైనవిగా మారాయి. ఈ రెండు ఫోన్ల ధర దాదాపు రూ.500 తగ్గింది. ఈ క్రమంలో ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు మరోసారి చూద్దాం.

Vivo Y21 రెండు మోడళ్లలో వస్తుంది. ఒకటి 4 GB RAM + 64 GB స్టోరేజ్ కాగా, మరొకటి 4 GB RAM + 128 GB స్టోరేజ్ ఉంది. లాంచ్ సమయంలో వాటి ధర వరుసగా రూ. 13990, రూ. 15490 ఉండగా, ఇప్పుడు ప్రారంభ వేరియంట్ ధర రూ.13490గానూ… Vivo Y21eతో 3 GB RAM, 64 GB స్టోరేజీతో అందుబాటులో ఉంటుంది. ఇది లాంచ్ సమయంలో రూ. 12990గా ఉండగా, ఇప్పుడు ఈ ధర రూ.12490 అయ్యింది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.

Vivo Y21 స్పెసిఫికేషన్‌లు:

Vivo Y21 స్పెసిఫికేషన్.. 6.51 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. 8 మెగాపిక్సెల్ కెమెరా, వెనుక ప్యానెల్‌లో డ్యూయల్ కెమెరా ఉంటుంది. ప్రధాన కెమేరా 13 మెగాపిక్సెల్‌లు, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్‌లు.

ఈ ఫోన్‌లో Helio P35 చిప్‌సెట్ ఉపయోగించబడింది.

ఇది 4 GB RAM, 128 GB ఇంబిల్ట్ స్టోరేజ్‌తో వస్తుంది. ఈ ఫోన్ 5000 mAh బ్యాటరీతో ఉండగా, దీనిలో 18W ఫాస్ట్ ఛార్జర్ అందుబాటులో ఉంటుంది.

Vivo Y21e స్పెసిఫికేషన్‌లు:

ఇది స్నాప్‌డ్రాగన్ 680 చిప్‌సెట్‌తో వస్తుంది.

3 GB RAM, 64 GB ఇంటర్నల్‌ స్టోరేజీతో ఉంటుంది.

Vivo Y21ని ఫీచర్స్ లాగనే ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు ఉంటాయి. రెండు స్మార్ట్‌ఫోన్‌లను మిడ్‌నైట్ బ్లూ, డైమండ్ గ్లో కలర్స్‌లో అందుబాటులో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news