కొంతమంది సక్సెస్ ని చూస్తే శభాష్ అనాలని అనిపిస్తుంది. లైఫ్ లో ఏదో ఒక టైంలో ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు. కానీ కొంచెం టైం పడుతుంది. అప్పటివరకు కష్టపడుతూ ఉండాలి. దేశీయ స్టాక్ మార్కెట్లో సంచలనాన్ని సృష్టించారు సోలార్ ప్యానల్స్ తయారీ సంస్థ ఎనర్జీ కంపెనీ యజమాని హితేష్ చిమన్లాల్ దోషి. ఈయన ఇప్పుడు రెన్యువల్ టెక్నాలజీ చైర్మన్ గా ఉన్నారు. మొదట ఈ కంపెనీని చాలా చిన్నగా స్టార్ట్ చేశారు. తర్వాత రాను రాను కంపెనీని విస్తరిస్తూ వచ్చారు.
చదువుతున్నప్పుడు ఆయన హార్డ్వేర్, ఎలక్ట్రానిక్స్ ట్రేడింగ్ చేసేవారు. నెలకి రూ. 1000 సంపాదించారు. తర్వాత కాలేజీ ఫీజులు అలాగే ఇతర ఖర్చులు కోసం వినియోగించారు. 1989లో వెంచర్ని మొదలుపెట్టారు. మొదట సంవత్సరం రూ. 12000 టర్నోవర్ సాధించారు. ప్రస్తుతం ఆయన మార్కెట్ క్యాప్ 71,244 కోట్లకు చేరింది. ఈయన మహారాష్ట్రలో బుల్దానా జిల్లాలో చిన్న గ్రామంలో పుట్టారు. వీరి తండ్రికి కిరాణా దుకాణం ఉండేది.
సొంత ఊర్లో ఏడవ తరగతి దాకా మాత్రమే ఉండడంతో పై చదువుల కోసం మరో గ్రామానికి వెళ్లారు. డిగ్రీ వరకు చదువుకున్నారు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఒకటిన్నర లక్షలు లోన్ తీసుకుని కంపెనీని స్టార్ట్ చేశారు. కుక్కర్లు, లాంతర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాల్లో బిజినెస్ చేశారు. తర్వాత వారీ ఎనర్జీస్ అని పేరు పెట్టారు. ఆయన ఆస్తి ఇప్పుడు దాదాపు 46 వేల కోట్లుగా ఉంది. కానీ అక్కడ నుంచి ఇక్కడ వరకు ఆయన పడిన కష్టం ఆయనని ఇంత దూరం తీసుకువచ్చింది. వావ్ సూపర్ సక్సెస్ కదా..? ఈయనని ఆదర్శంగా తీసుకుంటే చాలామంది ముందుకు వెళ్లొచ్చు.