దారుణం.. రాష్ట్ర అవతరణ దినం నిర్వహించరా..? : రోజా

-

చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల అవతరన దినోత్సవం లేకుండా పోయిందని మాజీ మంత్రి రోజా పేర్కొన్నారు. తాజాగా ఆమె ఎక్స్ ఖాతాలో స్పందించారు. “మన చుట్టూ ఉన్న అవతరన దినం ఉంది. కర్ణాటకకు అవతరణ దినం ఉంది. తమిళనాడుకు ఉంది. ఒడిశాకు కూడా అవతరణ దినం ఉంది. కానీ చంద్రబాబు వల్ల ఆంధ్రప్రదేశ్ కి అవతరణ దినోత్సవం లేకుండా పోయింది.

మా జగన్ అన్న ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నవంబర్ 01వ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించుకున్నాం. చంద్రబాబు ప్రభుత్వం జిల్లా స్థాయిలో కూడా అవతరణ దినోత్సవ నిర్వహణ రద్దు చేసింది. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని అవహేళన చేసే ఈ నిర్ణయం ఉంది” అంటూ ట్వీట్ చేశారు ఆర్.కే.రోజా. ఎంత దారుణం..ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించరా..? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా..? మీరసలు పాలకులేనా..? ఆంధ్రప్రదేశ్  ఎప్పుడు అవతరించిందని అడిగితే..భావితరాలకు ఏం సమాధానం చెప్తారు..? చంద్రబాబు… తక్షణమే ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని గత ప్రభుత్వంలానే ఇప్పుడు కూడా నిర్వహించాలి. ఆరు కోట్ల మంది తెలుగు ప్రజలను అవమానించినందుకు.. అమరజీవి పొట్టి శ్రీ రాములు గారి త్యాగాన్ని అవమానించినందుకు.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news