తప్పు చేసిన వారిపై చర్యలు లేవని కొంత మంది టీడీపీ, జనసేన నాయకులు కాస్త కోపంగా ఉండవచ్చు.. కానీ తప్పు చేసిన వారిని వదిలిపెట్టనని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ఈదుపాలెంలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. పార్టీ చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిచాం. గత పాలకులు తనను అకారణంగా జైలులో పెట్టారు. తప్పు చేసిన వారిని వదిలిపెడితే అది అసమర్థతే అవుతుందన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది ఎన్టీఆరే అని తెలిపారు.
మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేశాం. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. 45 ఏళ్ల తరువాత అతిపెద్ద విజయం సాధించామని తెలిపారు. గతంలో ఆడబిడ్డలపై వివక్ష ఉండేది. డ్వాక్రా సంఘాలకు పూర్వ వైభవం తీసుకొస్తామని స్పష్టం చేశారు. నాయకులు వస్తే.. అడ్డుగా పరదాలు కట్టడం.. అడ్డుగా ఉన్న చెట్లను కూలగొట్టడం ఉండకూడదని సూచించారు. రాజకీయ కక్ష సాధింపునకు వెల్లనని వెల్లడించారు చంద్రబాబు.