Colours Swathi: కలర్స్ స్వాతి రీ ఎంట్రీ..‘ఇడియట్స్’ ఫస్ట్ లుక్ రిలీజ్

-

‘కలర్స్’ అనే టీవీ ప్రోగ్రామ్ నుంచి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తార స్వాతి రెడ్డి..ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ‘డేంజర్’ ఫిల్మ్ తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.

హీరోయిన్ గానే కాకుండా ప్లే బ్యాక్ సింగర్ గానూ ఈమె తెలుగు తమిళ మలయాళ భాషలలో పని చేసింది. 2018 లో వికాస్ వాసును ప్రేమించి పెళ్లి చేసుకుని కొంత కాలం పాటు వెండి తెరకు దూరమైంది. ఇక ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నది.

Colors Swathi Hot Photos

‘ఇడియట్స్’ అనే సినిమాలో స్వాతి నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ శుక్రవారం విడుదల చేశారు. ఈ పోస్టర్ లో స్వాతి లుక్ అదిరిపోయింది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమ కథలో చక్కటి పాత్ర పోషిస్తోంది స్వాతి. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ పిక్చర్ రిలీజ్ డేట్ పై త్వరలో మేకర్స్ స్పష్టతనివ్వనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news