తెలంగాణ కాంగ్రెస్ లో ఎమ్మెల్యే సీతక్కది ప్రత్యేక స్థానం.. కరోనా మహమ్మారి సమయంలో కూడా తన నియోజకవర్గంలో ఇబ్బందులు పడుతున్న.. ప్రజలు సాయం చేసింది. అంతేకాకుండా.. అధికార టీఆర్ఎస్ నేతల నుంచి కూడా పలు ప్రశంసలు అందుకుంది. అయితే.. ఈ రోజు వరంగల్ లో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభలో పాల్గొన్నారు. అయితే.. తొలుత ఆయన ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాహుల్ గాంధీకి వారికి సంబంధించిన వివరాలను తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వివరించారు.
రేవంత్ మాటల్లో వారి దైన్య పరిస్థితిని విన్న రాహుల్ అనంతరం సభా వేదిక దిశగా కదిలారు. ఇంతలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఎదురురావడంతో రాహుల్ చిరునవ్వు నవ్వారు. రాహుల్ ను పలకరించిన సీతక్క తనతో పాటు తెచ్చిన రక్షను రాహుల్ చేతికి కట్టడంతో.. సీతక్క ఆప్యాయతకు స్పందనగా రాహుల్ గాంధీ ఆమె భుజం తట్టారు. అనంతరం ఇతర కాంగ్రెస్ నేతల నుంచి అభివాదాలను స్వీకరిస్తూ వేదికపైకి సాగారు.