టీఆర్ఎస్ తో పొత్తుపై సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ..

-

తెలంగాణలో పొత్తుల రాజకీయం నడుస్తోందని వార్తలు వస్తూనే ఉన్నాయి.. బీజేపీ, కాంగ్రెస్ ఒకటి అంటే.. కాదు.. కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయని.. లేదులేదు.. టీఆర్ఎస్, బీజేపీ చీకటి ఒప్పందాలు ఉన్నాయని ఒకరిపై ఒకరు విమర్శలు చేస్తుకుంటున్నారు. అయితే తాజాగా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా.. వరంగల్ లో నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. తెలంగాణను దోచుకున్న వ్యక్తితో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఒప్పందం చేసుకోదని, టీఆర్ఎస్ తో కాంగ్రెస్ ఎలాంటి పొత్తు పెట్టుకోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలందరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని, ఇకపై ఏ నాయకుడైనా ఈ ప్రశ్న అడిగితే వారిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని రాహుల్ వార్నింగ్ ఇచ్చారు.

ఎంత పెద్ద నేత అయినా పార్టీ నుంచి బయటకు పంపుతామని, అలాంటి ఆలోచన ఉన్నవారు టీఆర్ఎస్ పార్టీలోకో బీజేపీలోకో వెళ్లిపొండని మండిపడ్డారు. తెలంగాణ రైతులు, యువత నుంచి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వ్యక్తిని క్షమించే ప్రసక్తేలేదని, ప్రజల కోసం పోరాడిన వారికే ఎన్నికల టికెట్ ఇస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఎంత పెద్ద నేత అయినా రైతులకు అండగా నిలవకపోయినా, పేదల తరఫున పోరాడకపోయినా కాంగ్రెస్ పార్టీ వారికి టికెట్ ఇవ్వదన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు రాహుల్ గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news