శని దేవుడిని పూజించే సమయంలో వీటిని తప్పక గుర్తుంచుకోవాలి..

-

శనివారం వస్తే చాలా మంది శనీశ్వరుడిని పూజిస్తారు. ఆయన అనుగ్రహం ఉంటే శని ప్రభావం ఉండదని నమ్మకం. మరి కొంతమంది మాత్రం ఆ స్వామి పేరు తీసిన మనకు శని తగులుతుందని భయపడుతున్నారు..శని ప్రభావం మనపై పడితే కొన్ని సంవత్సరాల పాటు ఆ ప్రభావం మనపై ఉంటుందని ఇలా శని ప్రభావం ఉండటం వల్ల ఆర్థిక ఎదుగుదల లేకపోవడం అలాగే ఎన్నో మానసిక ఇబ్బందులు తలెత్తుతాయని ఆలోచనలో ఉంటారు.అందుకే శనీశ్వరుడిని పూజించాలంటే చాలామంది ఆలోచిస్తారు. అయితే ఇదంతా కేవలం వారి అపోహ మాత్రమే. శనీశ్వరుడు ఎవరి పై అనవసరంగా తన ప్రభావాన్ని చూపించరు.

ఇకపోతే కొంతమంది శనీశ్వరుడిని ఆలయంలోకి వెళితే ఇలా చేయాలి,అలా చెయ్యాలి. స్వామి వారిని ఇలా నమస్కరించాలి అంటూ ఏదేదో చెబుతారు.శనీశ్వరుడికి పూజించే సమయంలో శని వైపు చూస్తూ పూజ చేయకూడదు. అలాగే శని దేవుడిని నమస్కరించే సమయంలో శనీశ్వరునికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు.శని దేవుడి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడండి అలాగే ఆయనని నమస్కరించేటప్పుడు ఆయన పాదాలను మాత్రమే నమస్కరించాలి.. అని అంటారు..

అంతేకాదు ప్రతి శనివారం ఆలయానికి వెళ్లి ఆయనకు ఎంతో ఇష్టమైన నీలి రంగు పుష్పాలను సమర్పించి చలివిడి నైవేద్యంగా సమర్పించి పూజించాలి. శనివారం శనీశ్వరుడితో పాటు హనుమంతుడిని పూజించడం వల్ల మన పై ఉన్నటువంటి శని ప్రభావ దోషం పూర్తీగా తొలగి పోతుందని పెద్దలు చెబుతున్నారు.ఆయనను స్ప్రుసించేటప్పుడు శని అని పిలవకూడదు.శనీశ్వరుడు అని పిలవాలి.శివుడు వెంకటేశ్వరస్వామిల మనల్ని అనుగ్రహిస్తాడని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈస్వర అంశం కనుక శనిని ఎప్పుడూ శనీశ్వర అని మాత్రమే పలకాలని శాస్త్రం చెబుతోంది..ఇది తప్పక గుర్తుంచుకోండి.. శని బాధలు తొలగి అష్ట ఐస్వర్యాలు కలుగుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news