తెలంగాణలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ.. వరంగల్ లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొని ప్రసంగించారు. ఆయన వ్యాఖ్యలపై.. అధికార టీఆర్ఎస్ నేతలు విమ్మర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై.. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్‌ను పంజాబ్ రైతులే నమ్మలేదని, చైతన్యవంతులైన తెలంగాణ రైతులు ఎలా నమ్ముతారన్నారు.
అది రైతు సంఘరణ సభ కాదని, రాహుల్ సంఘర్షణ సభ అని తెలంగాణ ప్రజానికం భావిస్తున్నదని, వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఈడ్చి తన్నిందని ట్విటర్ వేదికగా రాహుల్ గాంధీపై మండిపడ్డారు. తెలంగాణ సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఎయిర్ పోర్టులో దిగి ఇవ్వాల ఏం మాట్లాడాలి, సభ దేని గురించి అని అడిగిన రాహుల్ గాంధీకి తెలంగాణ రైతుల గురించి ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో అర్థం అవుతుందని ఆయన ఎద్దేవా చేశారు.