నల్గొండ: మహిళ కడుపులో దూదిని మరచి కుట్లు వేసిన డాక్టర్లు

-

నల్గొండలో డాక్టర్ల నిర్లక్ష్యం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జ్యోతి అనే మహిళకు డెలివరీ చేసి దూదిని డాక్టర్లు కడుపులోనే ఉంచి కుట్లు వేశారు. దూది కడుపులోనే ఉండిపోవడంతో బాధిత మహిళ మూడు రోజుల పాటు నరకయాతన అనుభవించింది.ఈ విషయంపై బాధిత మహిళ, బంధువులు ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్లను నిలదీశారు.బాధితురాలి బంధువులకు డాక్టర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా..ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వట్టి ఖమ్మం పహాడ్ గ్రామానికి చెందిన గుంటి పద్మ(55) అనారోగ్యంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిందినల్గొండలో డాక్టర్ల నిర్లక్ష్యం మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల జ్యోతి అనే మహిళకు డెలివరీ చేసి దూదిని డాక్టర్లు కడుపులోనే ఉంచి కుట్లు వేశారు. దూది కడుపులోనే ఉండిపోవడంతో బాధిత మహిళ మూడు రోజుల పాటు నరకయాతన అనుభవించింది.ఈ విషయంపై బాధిత మహిళ, బంధువులు ఆసుపత్రి సూపరింటెండెంట్, డాక్టర్లను నిలదీశారు.బాధితురాలి బంధువులకు డాక్టర్లు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారంటూ బంధువులు ఆరోపిస్తున్నారు.ఇదిలా ఉండగా..ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వట్టి ఖమ్మం పహాడ్ గ్రామానికి చెందిన గుంటి పద్మ(55) అనారోగ్యంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది.డాక్టర్లు సరిగ్గా చూసుకోక పోవడంతో పద్మ పరిస్థితి విషమించింది..చికిత్స పొందుతూ మృతి చెందింది.ఇక ప్రభుత్వ అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలిస్తారు అనుకుంటే.. అది కూడా మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పారు.ఆసుపత్రిలో మరణించిన పద్మ కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు కూడా లేకపోవడంతో దాతల సహాయంతో చివరకు ప్రైవేట్ అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలించారు.దీంతో మహిళా బంధువులు ప్రభుత్వాసుపత్రి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డాక్టర్లు సరిగ్గా చూసుకోక పోవడంతో పద్మ పరిస్థితి విషమించింది..చికిత్స పొందుతూ మృతి చెందింది.ఇక ప్రభుత్వ అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలిస్తారు అనుకుంటే.. అది కూడా మరమ్మతులు జరుగుతున్నాయని చెప్పారు.ఆసుపత్రిలో మరణించిన పద్మ కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు కూడా లేకపోవడంతో దాతల సహాయంతో చివరకు ప్రైవేట్ అంబులెన్స్ లో స్వగ్రామానికి తరలించారు.దీంతో మహిళా బంధువులు ప్రభుత్వాసుపత్రి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Read more RELATED
Recommended to you

Latest news