ఇంజనీరింగ్ విద్యార్థులకు బ్యాడ్ న్యూస్.. సెలవుల పై ప్రకటన..

-

గత రెండేళ్ళు కరోనా కారణంగా అన్నీ సంస్థలు మూత పడ్డాయి.. విద్యా సంస్థలు కూడా క్లోజ్ అయిన విషయం తెలిసిందే.దాంతో విద్యార్థులు కేవలం ఇళ్లకే పరిమితం అయ్యారు.గత ఏడాది చివరి నుంచి ఈ ఏడాది లో విద్యార్థులకు కరోనా నిబంధనల తో పాఠాలు చెబుతూ సిలబస్ ను కంప్లీట్ చేశారు.అయితే ,ఇప్పుడు సెమిస్టర్ ఎగ్జామ్స్ తర్వాత సెలవుల గురించి మరో ప్రకటన చేశారు.అన్ని కళాశాలల్లోని ఇంజినీరింగ్‌, ఫార్మసీ విద్యార్థులకు రెండు వారాలపాటు వేసవి సెలవులు ఇవ్వాలని జేఎన్‌టీయూ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 15 నుంచి 29 వరకు సెలవులు ఇస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ ఆదేశాలు జారీ చేశారు. తిరిగి 30 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని కాలెజి . కరోనా కారణంగా విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడంతో తొలుత వేసవి సెలవులు లేకుండానే అకడమిక్‌ క్యాలెండర్‌ను ప్రకటించింది. తాజాగా విద్యాసంవత్సరంలో జేఎన్‌టీయూ మార్పులు చేసింది. రెండు వారాల అన్నా సెలవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 30 నుంచి ప్రారంభమై వచ్చే నెల 11న ముగుస్తాయి. అదే నెల 13 నుంచి రెండో సెమిస్టర్‌ తరగతులు ప్రారంభించి.. పరీక్షలు ఆగస్టు 24 నుంచి నిర్వహిస్తారు. ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్‌ తరగతులు ఆగస్టు 17 నుంచి, మూడో ఏడాది రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు 26 నుంచి మొదలు కానున్నాయని అకాడమీక్ క్యాలెండర్‌ లో పెర్కొంది..

 

Read more RELATED
Recommended to you

Latest news