ఎంపీ విజయసాయి రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన అయ్యన్న పాత్రుడు

-

ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే.. ఇటీవల వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి టీడీపీపై విరుచుకుప‌డుతున్న రీతిలోనే ఇప్పుడు టీడీపీ నేత‌లు కూడా ఆయ‌నపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా సోమ‌వారం నాడు ట్విట్ట‌ర్ వేదిక‌గా మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నేత‌ చింతకాయల అయ్య‌న్న‌పాత్రుడు… విజ‌య‌సాయిరెడ్డిపై ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. విజ‌య‌సాయిరెడ్దిని క్విడ్‌ప్రోకో జాతిపిత‌గా, సూట్‌కేసు కంపెనీల సృష్టి క‌ర్తగా అభివ‌ర్ణించారు అయ్య‌న్న‌పాత్రుడు.

Visakhapatnam: Ayyanna Patrudu demands cheque power to sarpanches

పెద్ద పెద్ద స‌వాళ్లు విసురుతున్నావంటూ విజయసాయి రెడ్డిని విమ‌ర్శించారు. వార్డుమెంబ‌ర్‌గా కూడా గెల‌వ‌ని నికృష్ణ చ‌రిత్ర నీది అంటూ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు అయ్యన్న పాత్రుడు . `గ‌డ్డం` నెరిసినా సింగిల్‌-మింగిల్ అంటూ ఆ స‌ర‌సం పోలేదంటూ అయ్యన్న ఎద్దేవా చేశారు. మీ జాతిర‌త్నం సింగిల్‌గా సింహంలా వచ్చేవాడైతే ఎందుకీ ప‌ర‌దాలు, వల‌లు, ప‌ర్య‌టించే ప్రాంతంలో 144 సెక్ష‌న్లు, షాపుల మూసివేత‌లు అంటూ అయ్యన్న పాత్రుడు చురకలు అంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news