ఏపీ మాజీ మంత్రి నారాయణను ఇవాళ ఉదయం ఏపీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై చిత్తూరు ఎస్పీ కీలక ప్రకటన చేశారు. ఏపీ మాజీ మంత్రి నారాయణను 10వ తరగతి మాల్ ప్రాక్టీసు కేసులో అరెస్ట్ చేసినట్టు ప్రకటన చేశారు చిత్తూరు ఎస్పీ. ఈ కేసులో ఎంతటి వారినైనా వదలబోమని హెచ్చరించారు చిత్తూరు ఎస్పీ.
దీనిపై పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. మొత్తం నారాయణ కాలేజీలో ఈ ప్రశ్న పత్రాలు మాల్ ప్రాక్టీస్ జరిగిందని వెల్లడించారు. ఇప్పటికే ప్రశ్న పత్రాలు మాల్ ప్రాక్టీస్ కేసులో 60 మందిని అరెస్ట్ చేశారని.. అందులో పూర్తి విచారణ జరిపాక నారాయణను అరెస్ట్ చేశారన్నారు.
ఇందులో ఎలాంటి కక్ష్య సాధింపు లేదని.. విచారణలో తేలిన వాస్తవాల ఆధారంగానే అరెస్ట్ చేశారని తెలిపారు. చంద్రబాబుకి మతిమరుపు వచ్చి రోజుకో మాట మాట్లాడుతున్నారు… పొత్తులపై మాట్లాడింది ఆయనే, మాట మార్చింది ఆయనేనని స్పష్టం చేశారు. చంద్రబాబుకి జనం గెలిపించరని తెలుసు.అందుకే పొత్తుల కోసం రోజు మాట్లాడుతారన్నారు. మేం మాత్రం ఒంటరిగా పోటీ చేసి మళ్ళీ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.