తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు మంత్రి హరీష్ రావు. త్వరలోనే 4722 స్టాఫ్ నర్సుల నియామకాలకు నోటిపికేషన్ ను ఇవ్వనున్నట్లు ప్రకటన చేశారు మంత్రి హరీష్ రావు. కరోనా మహమ్మారి సమయంలో సేవలు అందించిన వారికి ఈ నోటిఫికేషన్ లో వెయిటేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. 24 గంటలు పేషంట్లను కంటికి రెప్పలా కాపాడుకునే వారు నర్సులు అని.. ఒక్కరిద్దరు వలన చెడ్డ పేరు వస్తుందని చెప్పారు.
సొంతిళ్లూ కట్టుకునే వారికి త్వరలోనే రూ.3 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటన చేశారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాన్నీ ఒకేచోట అందుబాటులో ఉండాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పనిని టీఆర్ఎస్ సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నది. సీఎం కేసీఆర్ మానవతావాదిగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వచ్చే రోగి బంధువులకు మూడు పూటలా భోజనం పెట్టిస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 99 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే, తెలంగాణ రాష్ట్రం వచ్చాక 2 కోట్ల 59 మెట్రిక్ టన్నులు ధాన్యం పండిందని గుర్తు చేశారు.