భార్య అక్రమ సంబంధం.. వేట కత్తితో నరికిన భర్త..

వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రోజూ ఏదో ఒక చోట అక్రమ సంబంధాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. ఈ అక్రమ సంబంధాలు.. హత్యలకు దారి తీసి.. వారి జీవితాల్లో చీకటి నింపుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ లోని క‌ర్నూల్ జిల్లాలో ఎమ్మిగనూరు మండలం చెన్నాపురంకు చెందిన రాఘవేంద్ర (42) తాగుడికి బానిస‌య్యాడు. ఈ క్ర‌మంలో త‌ర‌చూ కుటుంబ స‌భ్యుల‌తో గొడ‌వ‌లు అయ్యాయి. కొంత కాలం కింద‌ట ఇంట్లో గొడ‌వప‌డి బ‌య‌ట‌కు వెళ్లిపోయాడు.

Illegal affair: Latest News, Videos and Photos of Illegal affair | The Hans  India - Page 1

కౌతాళం మండలం తిమ్మాపురం గ్రామానికి చేరుకుని అక్కడే జీవించసాగాడు. అదే గ్రామంలో వ్యవసాయ పనులకు వెళుతున్న సమయంలో ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేత‌ర సంబంధానికి దారితీసింది. అయితే ఇటీవల వీరి వ్య‌వ‌హారం విష‌యం వివాహిత భ‌ర్త హనుమంతురెడ్డికి తెలిసింది. దీంతో ఆవేశంతో రగిలిపోయిన అతడు రాఘవేంద్రను ప్రాణాలు తీయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. దీని కోసం అదే గ్రామానికి చెందిన మూకయ్య సహకారం తీసుకున్నాడు.

ప్లాన్ ప్రకారం వీరిద్దరు రాత్రి నిద్ర ఉన్న రాఘవేంద్రను వేటకొడవలితో నరికి చంపేసారు. అరవకుండా ఒకరు రాఘవేంద్ర నోటిని మూసివుంచగా మరొకరు వేటకత్తితో నరికి చంపారు. ఇలా హన్మంతురెడ్డి, మూకయ్య సైలెంట్ గా రాఘవేంద్రను అతి దారుణంగా చంపేసారు. ఆ తర్వాత తమకేమీ తెలియదన్నట్లుగా వుండిపోయారు. రాఘవేంద్ర రక్తపు మడుగులో ప్రాణాలు కోల్పోయి పడివుండటాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డాగ్ స్వాడ్ తో ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పోలీస్ కుక్కలు హనుమంతు ఇంటిచుట్టూ తిరగడంతో అనుమానం వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టాడు. తన భార్యతో రాఘవేంద్ర అక్రమసంబంధాన్ని కొనసాగించడంతోనే హతమార్చినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. ఈ హత్యలో అతడికి సహకరించిన మూకయ్యను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.