బాదుడే.. బాదుడు.. ఈ సారి పెరిగిన సీఎన్జీ ధరలు..

-

రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడిపై పెనుభారం పడుతోంది. ఇంధన ధరలు పెరిగిపోతున్నాయని… సామాన్యుడి చూపు.. ఎలక్ట్రిక్ బైక్ ల వైపు పడుతుంటే.. ఆ ఎలక్ట్రిక్ బైక్ లేమో ఎక్కడికక్కడ పేలుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అయితే.. ఇప్పుడు సీఎన్జీ వాహనాల వాడకం పెరిగింది.. అయితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కన్ను సీఎన్జీ పైన పడింది.. కేంద్ర ప్రభుత్వం ప్రతివారం ఏదో ఒక రూపంలో ఇంధన ధరలను పెంచుతూనే ఉన్నది.

After LPG, CNG and piped cooking gas price hiked | Business News,The Indian  Express

మే 1న కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచగా, గత వారం గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌పై వడ్డించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సీఎన్జీ (CNG) వంతు వచ్చింది. ఢిల్లీ ఎన్సీఆర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఇంద్రప్రస్త గ్యాస్‌ లిమిటెడ్‌ (ఐజీఎల్‌) కిలో సీఎన్జీపై రూ.2 చొప్పున భారం మోపింది. దీంతో ఢిల్లీలో కిలో సీఎన్జీ ధర రూ.73.61కి చేరింది. దీంతో వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news