వీళ్లు సిక్స్ ప్యాక్ తీసుకురావడం కోసం కాస్మోటిక్ సర్జరీ చేస్తారట. దాన్నే ఇన్ స్టంట్ సిక్స్ ప్యాక్ అని కూడా పిలుస్తారట. మొదటి సారిగా ఓ యువకుడిపై ఈ సర్జరీని ప్రయత్నించారు.
సిక్స్ ప్యాక్.. ఇది నేటి యూత్ కల. ఎందుకంటే.. సిక్స్ ప్యాక్ ఉందంటే చాలు.. ఎటువంటి అమ్మాయినైనా ఈజీగా పడేయొచ్చు. అమ్మాయిలు కూడా సిక్స్ ప్యాక్ ఉన్న యువకులకు ఈజీగా పడిపోతారు. అందుకే… యూత్ కూడా సిక్స్ ప్యాక్ తెచ్చుకోవడం కోసం జిమ్ లో తెగ కష్టపడుతుంటారు.
సిక్స్ ప్యాక్ అంత ఈజీగా రాదు.. దాని కోసం సంవత్సరాలు కష్టపడాలి. సినిమా హీరోలు కూడా సిక్స్ ప్యాక్ కోసం సపరేట్ ట్రెయినర్ ను పెట్టుకొని ఏళ్లకు ఏళ్లు కష్టపడి అప్పుడు సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటారు.
హే.. ఇదంతా పాత కాలం మాట. మా దగ్గరికి రండి.. ఎటువంటి కసరత్తులు అవసరం లేదు.. రెడీమెడ్ సిక్స్ ప్యాక్ ను తయారు చేసి చూపిస్తాం.. అని అంటున్నారు బ్యాంకాక్ లోని మాస్టర్ పీస్ ఇంటర్నేషనల్ ఆసుపత్రి.
వీళ్లు సిక్స్ ప్యాక్ తీసుకురావడం కోసం కాస్మోటిక్ సర్జరీ చేస్తారట. దాన్నే ఇన్ స్టంట్ సిక్స్ ప్యాక్ అని కూడా పిలుస్తారట. మొదటి సారిగా ఓ యువకుడిపై ఈ సర్జరీని ప్రయత్నించారు. సక్సెస్ కూడా అయ్యారు. మీరు ఫోటోల్లో చూస్తున్న వ్యక్తి అతడే. అతడికి అచ్చు గుద్దినట్టుగా.. జిమ్ కు వెళ్తే ఎలా సిక్స్ ప్యాక్ వస్తుందో అలాగే వచ్చింది.
అంతే.. అప్పటి నుంచి ఆ ఆసుపత్రికి సిక్స్ ప్యాక్ కోసం క్యూ కడుతున్నారట జనాలు. దీని వల్ల రెండు లాభాలు ఉన్నాయట. ఒకటేమో… పొట్ట భాగం దగ్గర ఉన్న అనవసర కొవ్వును కరిగించడం, రెండోది… సిక్స్ ప్యాక్. అందుకే… యూత్ ఎక్కువగా ఈ ఆసుపత్రికి లైన్ కడుతున్నారట.
ఇది కేవలం యువకులకే కాదు… యువతులకు కూడా మంచి మంచి ఆఫర్లు అందిస్తోంది. జీరో సైజు నడుము, పిరుదులను అందంగా తయారు చేయడం, ఎత్తుగా ఉండే వక్షోజాలకు సర్జరీలు చేయడం.. ఇలా అమ్మాయిలు అందంగా, నాజూకుగా తయారు కావడానికి ఈ ఆసుపత్రికి లైన్ కడుతున్నారట. భలే ఉంది కదా ఈ హాస్పిటల్. చిటికెలో సిక్స్ ప్యాక్ రెడీ.. అన్నట్టుగా ఉంది ఈ ఆసుపత్రి తీరు.