బాగా పెంచేసిన అనసూయ

-

జబర్దస్త్ యాంకర్ అనసూయ క్రేజ్ గురించి మనకు తెలిసిందే. ఉదయభాను తర్వాత యాంకర్ గా అందాలతో అదరగొట్టిన అనసూయ అటు బుల్లితెర, వెండితెర అనే తేడా లేకుండా వరుస అవకాశాలను అందుకుంటుంది.

క్షణం సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై తన లక్ టెస్ట్ చేసుకున్న అనసూయ వరుస ఛాన్సులు కొట్టేస్తుంది. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త రోల్ ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం కథనం సినిమా చేస్తున్న అనసూయ మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఛాన్స్ పట్టేసిందని తెలుస్తుంది.సైరా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో అనసూయ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందట.

ఈ పాత్రకు గాను అనసూయ పాతిక లక్షల నుండి 30 లక్షల దాకా డిమాండ్ చేస్తుందని తెలుస్తుంది. అనసూయ క్రేజ్ దృష్ట్యా నిర్మాతలు ఆమె అడిగినంత ఇచ్చేందుకు ఓకే చెప్పారట. మొత్తానికి అనసూయ ఫుల్ ఫాంలో ఉంది. స్మాల్, సిల్వర్ స్క్రీన్ పై ఆమె హవా చూస్తుంటే ఓ చిన్న హీరోయిన్ కు ఉన్న పాపులారిటీ కన్నా ఎక్కువే ఉందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news