రణ్‌వీర్ సింగ్ ఫిల్మ్‌పై RGV సెటైర్..మహేశ్ ‘సర్కారు వారి పాట’తో పోలిక

-

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారన్న సంగతి అందరికీ విదితమే. ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తుంటారు వర్మ. ఈ క్రమంలోనే వివాదాలను సృష్టిస్తుంటాడు. అలా మీడియాలో హైలైట్ అవుతూనే ఉంటారు.

ఇటీవల కాలంలో KGF2, పుష్ప, RRR వంటి సినిమాలు హిట్ అయిన నేపథ్యంలో వీటిని గురించి మాట్లాడుతూ బాలీవుడ్ ఇండస్ట్రీపైన తన దైన శైలిలో సెటైరికలు విమర్శలు చేశారు వర్మ. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాను బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణ్ వీర్ సింగ్ ‘జయేశ్ భాయ్ జోర్దార్’ పిక్చర్ తో కంపార్ చేస్తూ సెటైరికల్ ట్వీట్ చేశారు.

ఈ నెల వీకెండ్ కలెక్షన్స్ లో హిందీలో ‘రణ్ వీర్ సింగ్ ‘‘జయేశ్ భాయ్ జోర్దార్’’ ఫిల్మ్ రూ.11.75 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసిందని, మహేశ్ బాబు ‘‘సర్కారు వారి పాట’’ రూ.135 కోట్లు కలెక్ట్ చేసిందని పేర్కొన్నారు. RGV ట్వీట్ చూసి నెటిజన్లు..వర్మ మళ్లీ బాలీవుడ్ పై సెటైర్ వేశాడని అంటున్నారు. సౌత్ ఫిల్మ్స్ స్టామినా బాగా పెరిగిందని వర్మ చెప్పకనే చెప్తున్నారని పేర్కొంటున్నారు. కాగా, ‘సర్కారు వారి పాట’కు రూ.135 కోట్లకు మించి కలెక్షన్స్ వచ్చాయని మరి కొందరు నెటిజన్లు ట్వీట్స్ చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news