ప్రభాస్ సరసన మరో సినిమాకి ఓకే చెప్పిన అనుష్క

-

ప్రాభాస్,అనుష్క ఇద్దరు కలిసి ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించారు.ఈ ఇద్దరినీ తెరపై చూసిన ఆడియన్స్ జోడి అంటే ఇదే అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆ సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.బాహుబలి-2 తరువాత ఈ జంట మళ్ళీ తెరపై కనిపించలేదు.ఈ జంటను మళ్లీ తెరపై చూడడానికి అభిమానులు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అలాంటి అభిమానుల కోరిక త్వరలో నెరవేరుతుంది అని తెలుస్తోంది.

‘నిశ్శబ్దం’తరువాత అనుష్క మరో సినిమా చేయలేదు.ఒక సినిమా ఏదో ఒప్పుకుందని అన్నారు కానీ అందుకు సంబందించిన అప్డేట్స్ లేవు.ఈ నేపథ్యంలో ఆమెను దర్శకుడు మారుతి ఒప్పించినట్లు గా ఒక వార్త షికారు చేస్తోంది.దర్శకుడు మారుతి.. ప్రభాస్ హీరోగా ఒక సినిమా చేయనున్నారు.ఈ సినిమాకి ‘రాజా డీలక్స్ ‘ అనే టైటిల్ ను ఖరారు చేశారు.ఈ సినిమాలో హీరోయిన్ గా అనుష్క అయితే ఈ ప్రాజెక్టుకు మరింత ప్లస్ అవుతుందని భావించిన ఆయన అనుష్క ను ఒప్పించినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news