నిన్న జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ పై లక్నో గ్రాండ్ విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్ వరకూ సాగిన మ్యాచ్ లో కేకేఆర్ పై లక్నో రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 14 మ్యాచుల్లో తొమ్మిది విజయాలతో లక్నో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. అయితే.. ఈ మ్యాచ్ లో 68 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఈ సీజన్ లో 14 మ్యాచ్‌లు ఆడిన రాహుల్.. 537 పరుగులు చేశాడు. రాహుల్ ఇలా ఒకే సీజన్ లో 500 పై చిలుకు స్కోరు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. ఐపీఎల్ 2018 సీజన్ నుంచి వరుసగా ఐదు సీజన్లలోనూ అతను 500 ప్లస్ స్కోర్ చేస్తూనే ఉన్నాడు. 2018 లో 659 పరుగులు, 2019 లో 593 పరుగులు, 2020లో 670, 2021 లో 626, 2022 లో 537 పరుగులు చేశారు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. ఈ 15 ఏళ్ల లో ఇలా వరుసగా ఐదు సీజన్లలో 500 పైచిలుకు స్కోరు చేసిన ఏకైక ప్లేయర్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు.