డ్యూమస్ బీచ్ లో నిజంగా దెయ్యాలు ఉన్నాయా..? నైట్ వెళ్లిన వాళ్లు ఏమంటున్నారంటే..!

-

గుజరాత్‌లోని సూరత్‌కు 19 కిలోమీటర్ల దూరంలో డ్యూమస్ బీచ్ ఉంటుంది. అన్ని బీచుల్లా కాదు..ఇది చూసేందుకే కాస్త భయంగా ఉంటుంది.. ఈ బీచ్ లో ఆత్మలు సంచరిస్తాయని, నైట్ టైమ్స్ లో బీచ్ దగ్గరకు వెళ్లే వారికి హాని తలపెడతాయని వామ్మో కథలు కథలుగా అక్కడి ప్రజలు చెప్పుకుంటారు..!ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితే.. ఈ భయంతోనే ఈ బీచ్ లో సాయంత్రం అవగానే.. ఎవరూ ఉండరూ..! తెలియక ఎవరైనా వెళ్తున్నా.. అక్కడి ప్రజలు వాళ్లను వెళ్లనివ్వరూ..! అంతుందా ఆ బీచ్ కి.. నిజంగా దెయ్యాలు ఉన్నాయంటారా..!
చిమ్మ చీకటిలాంటి నల్లటి సముద్రపు ఇసుక. వింతైన శబ్దాలు చేసే గాలులు. చెవిలో ఎవరో ఏదో చెబుతున్నట్టు అస్పష్టమైన మాటలు. దూరంగా వినిపించే వికృతపు నవ్వు. కుక్కల ఏడుపులు. చీకటిపడిన వేళ ఎవరైనా ఒంటరిగా అక్కడకు వెళితే మాత్రం భయంతో బిగదీసుకుపోవడం పక్కా.. మీరే ఊహించుకోండి.. అలాంటి ప్రదేశంలో మీరు ఒక్కరే ఉంటే. పైన చెప్పినవీ మీకు జరుగుతుంటే.. వామ్మో అనిపిస్తుందా.!
వేలాది ఆత్మలు ఇక్కడ సంచరిస్తున్నాయని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. టెస్ట్ చేద్దామని కొందరు ధైర్యం చేసి వెళ్లారట.వారికి ఆత్మల మాటలు లీలగా వినిపించాయని, తక్షణం అక్కడ్నుంచి వెళ్లిపొమ్మని ఆదేశించాయని చెబుతారు. పక్కనే ఎవరో బిగ్గరగా నవ్విన చప్పుడు వినిపిస్తుందని, చూస్తే ఎవరూ ఉండరన్నది రాత్రిపూట అక్కడికి వెళ్లివచ్చిన కొందరి అనుభవాలు.
పగటిపూటే నల్లగా భయపడుతున్నట్టుగా కనిపించే డ్యూమస్‌ బీచ్‌ రాత్రిపూట మరింత దారుణంగా ఉంటుంది. నిజానికి నాలుగు బీచ్‌ల సంగమమే డ్యూమస్‌ బీచ్‌. ఇందులో రెండు బీచ్‌లు టూరిస్టులకు తెలిసినవే! మూడో బీచ్‌లో జన సంచారం చాలా తక్కువగా ఉంటుంది.. ఇక నాలుగో బీచ్‌ అయితే నిర్మానుష్యమే. నల్లటి సముద్రపు ఇసుక ఇక్కడ ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ హిందూ స్మశాన వాటిక ఉండేది. కొన్ని వేల దహనసంస్కారాలు ఇక్కడ జరిగాయి. అలా ఏర్పడిన బూడిద సముద్రపు ఇసుకతో కలిసి నల్లగా తయారయ్యిందని స్థానికులు అంటుంటారు.
ఈ బీచ్‌లోకి వచ్చే కుక్కలు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాయట. అదేపనిగా అరుస్తూనే ఉంటాయి. ఎదురుగా ఎవరో ఉన్నట్టుగానే మొరుగుతుంటాయట! కుక్కలను కంట్రోల్‌ చేయడానికి యజమానులకు చుక్కలు కనిపస్తాయి. కొంతమంది ఇలాంటివి నమ్మని వాళ్లు ఉంటారుగా.. ఈరోజుల్లో ఏంటి ఇందంతా సోది అనుకుని.. అక్కడి వారు చెప్పిన మాటను వినకుండా బీచ్‌లోకి వెళ్లిన కొందరు ఇప్పటికీ తిరిగిరాలేదనే వదంతులను కూడా ఉన్నాయి.
చుట్టుపక్కల గ్రామాల్లోని కొందరు ఇలాగే బీచ్‌కు వెళ్లి కనిపించకుండా పోయారట. బీచ్‌కు కూతవేటు దూరంలో ఓ పురాతన హవేలి ఉంది. నవాబు సిది ఇబ్రహీం ఖాన్‌ ఈ ప్యాలెస్‌ను కట్టించాడు. ప్రస్తుతం ఇందులో ఎవరూ నివసించడం లేదు. కాకపోతే దూరం నుంచి చూస్తే బాల్కనీలో ఎవరో నిల్చున్నట్టుగా కనిపిస్తుంది. దగ్గరకు వెళితే మాత్రం ఆ ఆకారం అదృశ్యమవుతుందట.. ఈ భయం కొద్దే హవేలీలోకి ఎవరూ వెళ్లడం లేదు.

కానీ కొందరి మాట వేరుగా ఉంది..!

కొందరు దయ్యాల్లేవు.. ఆత్మల్లేవు.. అంతా ఉత్తిదే అని అనేవాళ్లూ ఉన్నారు.. ఆత్మలు లేవని నిరూపించడానికే రాత్రంతా బీచ్‌లో బస చేసి వచ్చారు. ఆత్మలున్నాయని చెబుతున్నదాంట్లో నిజం లేదని చెబుతున్నారు. స్థానికులు చెబుతున్నట్టు డ్యూమస్‌ బీచ్‌ అంత భయానకంగా ఏమీ ఉండదని వారు అంటున్నారు. ఏదో ప్రయోజనం కోసం కొందరు ఈ దుష్ర్పచారాన్ని మొదలు పెట్టారని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. చూడబోతే ఏదో క్రెమ్ సస్పెన్స్ సినిమా కథలా ఉంది కదా..!

Read more RELATED
Recommended to you

Latest news