ఈమధ్య సోషల్ మీడియాలో సినిమాలపై ట్రోలింగ్ ఎక్కువైందని మండిపడ్డారు నిర్మాత ఆదిశేషగిరిరావు. ఫిలిం ఛాంబర్ లో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ఓటిటీలపై మొదటినుంచి సెన్సార్ లేదని.. ప్రభుత్వంతో దీనిపై మనం చర్చించాలని అన్నారు. పైరసీని అరికట్టడంలో ఫిలింఛాంబర్ కృషి చేయాల్సి ఉందన్నారు ఆదిశేషగిరిరావు. నిర్మాతల మండలి కూడా గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
సినిమా టికెట్ల రేట్ల వ్యవహారంపై నిర్మాతలు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలతో సినిమా టికెట్లకు ఫ్లెక్సిబుల్ రేట్లు ఉండాలి అని అడిగితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. డిమాండ్ కు తగ్గట్టు రేట్లు పెట్టాలి అన్నారు. గతంలో లాగా అందరూ కూర్చొని మాట్లాడుకోవాలి అన్నారు. సోషల్ మీడియా సైతం కట్టుబాటు ఉండాలి అని అన్నారు. కంటెంట్ మీద విమర్శ మంచిదే కానీ వ్యక్తిగతంగా విమర్శలు వద్దని అన్నారు ఆదిశేషగిరిరావు.