ప్రాణాలు తీసిన డేంజర్ సెల్ఫీ.. వీడియో

-

సెల్ఫీ.. తీసుకోవడం ముఖ్యం కాదు. ఎక్కడ తీసుకున్నాం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే.. సెల్ఫీ మోజులో పడి ఎవరు ఏం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. సెల్ఫీల కోసం తమ ప్రాణాలను కూడా రిస్క్ లో పెట్టేస్తున్నారు. అలా సెల్ఫీ కోసం తమ ప్రాణాలను సైతం పోగొట్టుకున్నవాళ్లను ఎంతోమందిని చూశాం. ఇది కూడా అటువంటి ఘటనే.

Danger selfie youth fell of the building and died while taking selfie

ముంబై పోలీసులు.. డేంజర్ సెల్ఫీలపై అవగాహన కల్పించడం కోసం ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి పేద్ద బిల్డింగ్ పైన చివరకు వెళ్లి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. నిజానికి అటువంటి సెల్ఫీలే డేంజర్. అతడు ఇంకాస్త చివరకు వెళ్లి సెల్ఫీ తీసుకోబోయాడు. అంతే. కాలు కొంచెం జారింది. దీంతో ఆ యువకుడు ఆ బిల్డింగ్ నుంచి కింద పడి తన ప్రాణాలను కోల్పోయాడు. అంత రిస్క్ చేసి మరీ.. సెల్ఫీలు తీసుకోవడం అవసరమా. బాధ్యతారహితంగా సాహసాలు చేయడం వల్ల వచ్చేదేమీ ఉండదు. ప్రాణాలు రిస్క్ లో పడటమే కదా.. అంటూ ముంబై పోలీసులు ఆ వీడియోను షేర్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news