తల్లి మృతదేహంతో యువతి.. పది రోజులు ఒకే ఇంట్లో..

-

ఓ యువతి తల్లి మృతదేహంతో పది రోజులపాటు ఇంట్లోనే ఉంది. ఆ ఇంట్లో నుంచి వస్తున్న దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరానగర్‌లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. తల్లి మృతదేహంతో గడిపిన ఆ యువతిని 26 ఏళ్ల అంకిత దీక్షిత్‌గా గుర్తించారు. తల్లి మృతి చెందిన విషయాన్ని ఆమె తమ బంధువులకు కూడా చెప్పకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇరుగుపొరుగు వారి సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి తల్లి సునీత దీక్షిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

4 including 2 children found dead at holiday cottage in Alibag | Mumbai  news - Hindustan Times

ఆమె హిందూస్థాన్ ఏరోనాటిక్స్‌ (హెచ్ఏఎల్)లో ఇంజినీర్‌గా పనిచేసి రిటైర్ అయినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నప్పుడు ముఖ్య ద్వారానికి తాళం వేసి ఉంది. అంతేకాకుండా.. లోపలి నుంచి యువతి మాటలు వినిపించడంతో పోలీసులు తలుపు తట్టారు. అయితే, డోర్ తెరిచేందుకు అంకిత నిరాకరించింది. పోలీసులను చూసి నిరసన తెలిపింది. దీంతో మరో గత్యంతరం లేని పోలీసులు కార్పెంటర్‌ను పిలిపించి తలుపు తెరిచి ఇంట్లోకి ప్రవేశించారు. లోపల అంకిత ఒక గదిలో ఉండగా, మరో గదిలో ఆమె తల్లి మృతదేహం కనిపించింది. అంకిత మానసిక స్థితి సరిగా లేదని పోలీసులు గుర్తించారు.

తొలుత మాట్లాడలేకపోయిన అంకిత.. ఆ తర్వాత పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంతో ఆమెను చనిపోయిన మహిళ కుమార్తెగా గుర్తించారు. సునీత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టానికి తరలించారు. ఆమె మరణానికి కారణాలు తెలియరాలేదు. సునీత దీక్షిత్ పదేళ్ల క్రితమే భర్త రజనీష్ దీక్షిత్ నుంచి విడాకులు తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఆమె కేన్సర్‌తో బాధపడుతున్నట్టు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news