ట్రాన్స్‌జెండర్ల ఓవరాక్షన్‌.. అపార్ట్‌మెంట్‌లోకి పంపాలని సెక్యూరిటీపై దాడి

-

మనం రోజు ట్రాన్స్‌ జెండర్లను చూస్తూనే ఉంటాం.. వీరిలో కొంతమంది మంచిగా ఉన్నా.. మరి కొంతమంది మాత్రం ఓరాక్షన్‌ చేస్తుంటారు. ట్రాన్స్‌జెండర్లలో ఉన్న శిఖరాలు అధిరోహించిన వారు కూడా ఉన్నారు కూడా. కానీ కొంతమంది ట్రాన్స్‌ జెండర్లను చేసే పనులకు మొత్తం ట్రాన్స్‌ జెండర్లనే తప్పుగా భావించేలా చేస్తున్నారు. అలాంటి ఘటనే ఇంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని ప్రగతినగర్​లో ఆదివారం వేకువజామున మూడు నుంచి నాలుగు గంటల సమయంలో రాయల్​విలేజ్​ గెటెడ్​ కమ్యూనిటీలోకి వెళ్లేందుకు ట్రాన్స్​జెండర్స్​ ప్రయత్నించారు. అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీగార్డ్​ ఈశ్వరరావు… వాళ్లను అడ్డుకుని లోపలికి వెళ్లేందుకు నిరాకరించాడు. అంతేకాకుండా.. లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదని కరాఖండిగా చెప్పేశాడు. ఎంతసేపటికీ లోపలికి అనుమతించకపోవటంతో.. ట్రాన్స్​జెండర్లు సహనం కోల్పోయారు. ఈశ్వరరావుతో వాగ్వాదానికి దిగారు. ఇదే క్రమంలో.. గొడవ కాస్తా ఘర్షణగా మారింది.

Thumbnail image

ట్రాన్స్​జెండర్లు అంతా కలిసి సెక్యూరిటీ గార్డు ఈశ్వరరావుపై మూకుమ్మడి దాడికి దిగారు. పైపులు, కుర్చీలు.. చేతికి ఏది దొరికితే దానితో.. ఈశ్వరరావును రక్తమొచ్చేలా చితకబాదారు. ఈశ్వరరావుతో పాటు విధుల్లో ఉన్న ఇంకో సెక్యూరిటీ గార్డు ఎంత ఆపినప్పటికీ ఆగకుండా.. అతనిపై కూడా దాడి చేస్తూనే ఉన్నారు. వేరే వ్యక్తి వచ్చి మందలించినప్పటికీ.. తిరిగి అతనిపైకి విరుచుకుపడ్డారు. సెక్యూరిటీ గార్డుపై కోపం తీర్చుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం.. బాచుపల్లి పోలీస్​స్టేషన్​లో ఈశ్వర్​రావు ఫిర్యాదు చేశాడు.

కాలనీలోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే ఆపినందుకు.. తనపై దాడి చేశారని.. ఆఫీస్​ ఫర్నీచర్​ ధ్వంసం చేశారని ఫిర్యాదులో తెలిపాడు. దాడి సమయంలో డయల్​ 100కు ఫోన్​ చేయగా.. తాము అందుబాటులో లేమని పోలీస్​ సిబ్బంది బదులిచ్చినట్టు ఈశ్వర్​రావు తెలిపాడు. దాడికి సంబంధించి.. అక్కడే ఉన్న సీసీకెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ఆధారంగా విచారణ చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news