Mehreen: నలుపు దుస్తుల్లో నగలతో..మెహ్రీన్ వగలమారి హొయలు

-

బ్యూటిఫుల్ హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా కౌర్..తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ఫిల్మ్ లో ఇన్నోసెంట్ గర్ల్ ‘మహాలక్ష్మి’గా తన నటనతో ప్రేక్షకుల మెప్పు పొందింది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఇండస్ట్రీలో ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ.

గతంలో బొద్దుగా ఉండే ఈ సుందరి..ఇటీవల చిక్కింది. అయితే, చక్కనమ్మా చిక్కినా అందమే అన్నట్లు స్లిమ్ లుక్ లోనూ మెహ్రీన్ మెరిసిపోతున్నది. ఈ భామ నటించిన ఫన్ మూవీ ‘F3’ ఈ నెల 27న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో మెహ్రీన్ ఫుల్ బిజీగా ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో ‘హనీ’గా మెహ్రీన్ కనబడనుంది. తాజాగా ఈ సుందరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి. నలుపు రంగు డ్రెస్సులో టాప్ స్లీవ్ లెస్ ధరించిన ఫుల్ స్కర్ట్ అలా స్మైల్ ఇస్తూ రకరకాల ఫోజులిచ్చింది.

తగు నగలు ధరించి హొయలు పోయింది ఈ భామ. మెడలో నగలు చూపుతూ అలా నడుముపై చేయి వాల్చి కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఈ చిత్రంలో మెహ్రీన్ పాత్ర చాలా చక్కగా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిల్మ్ లో వరుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్ నటించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news