బ్రిటన్ లో మంకీపాక్స్ కల్లోలం… పెరుగుతున్న కేసులు

-

బ్రిటన్ లో మంకీపాక్స్ వైరస్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నైజీరియా నుంచి వచ్చిన ఓ యువకుడికి మే 7న తొలి కేసును ధ్రువీకరించారు. ఆ తరువాత నుంచి ఒక్కొక్కటిగా కేసుల సంఖ్య పెరుగుతోంది. బ్రిటన్ లో కొత్తగా మరో 36 మంకీపాక్స్ వైరస్ కేేసులు బయటపడ్డాయి. దీంతో కేసుల మొత్తం సంక్య 56కు చేరుకుంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్థితిని సమీక్షించారు. యూకేలో స్వలింగ సంపర్కుల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. 

ప్రస్తుతం యూరప్, అమెరికా కలపి మొత్తం 100 కంటే ఎక్కువ అనుమానిత కేసులు ధ్రువీకరించారు. మొత్తం 12కు పైగా దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే మంకీపాక్స్ కేసులు బెల్జియంలో వెలుగు చూడటంతో తొలిసారిగా ఆదేశంలో మంకీపాక్స్ సోకిన వారికి 21 రోజులు క్వారంటైన్ నిబంధనలను తప్పనిసరి చేశారు. ఆస్ట్రేలియా, బెల్జియం, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ ఇలా పలు దేశాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఇండియా కూడా మంకీపాక్స్ పై అప్రమత్తం అయింది. ప్రభావిత దేశాల నుంచి ఇండియాకు వచ్చే వారిని క్షణ్ణంగా పరీశీలించాలని.. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వెంటనే వారి నుంచి శాంపిళ్లను సేకరించి పుణేలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించాలని ఐసీఎంఆర్ ను ఆదేశించింది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news