జగన్‌ వ్యాఖ్యలపై పవన్‌ కల్యాణ్ సంచలనం..

-

ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్‌లో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్‌ నేడు దావోస్‌లో ప్రసంగిస్తూ.. ఏపీ గురించి వివరించారు. అయితే.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీలో వాస్తవాలు ఒకటైతే దానికి భిన్నంగా విదేశిపెట్టుబడుల కోసం మాట్లాడారని పవన్‌ కల్యాణ్ ఆరోపించారు. కరోనా మహమ్మారి విజృంభణ సమయంలో ఏపీలో బాధితులకు ఆక్సిజన్ కూడా అందించలేకపోయారని పేర్కొన్నారు పవన్‌ కల్యాణ్.

Pawan Kalyan:వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందా? - NTV

తిరుపతి ఆసుపత్రిలో ఆక్సిజన్‌ అందక 30మంది చనిపోయిన విషయాన్ని వేదికపై ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు పవన్‌ కల్యాణ్. ఏపీలో అంబులెన్సులు , ఆస్పత్రిలో చనిపోతే కనీసం మృతదేహాన్ని తరలించడానికి వాహనాలు లేవని వెల్లడించారు పవన్‌ కల్యాణ్. ఏపీ ప్రభుత్వం వైద్య సేవలందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని పవన్‌ కల్యాణ్ విమర్శించారు. కరోనా మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం రూ. 11 వందల కోట్లను దారి మళ్లించారని ఆరోపించారు. రుయా ఆసుపత్రిలో పసిబిడ్డ మృతదేహాన్ని నిరుపే పేద తండ్రి బైక్ మీద తీసుకువెళ్లిన ఘటనను ప్రజలు మరిచిపోలేదని అన్నారు పవన్‌ కల్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news