విద్యా, వైద్య రంగాలపై కేసీఆర్ దృష్టి పెట్టారని అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అన్ని ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆమె అన్నారు. ఇందులో భాగంగా విడతల వారీగా స్కూళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే నిధులు కూడా కేటాయించామని వెల్లడించారు. అభివృద్ధి అంటే స్కూల్ కి కలర్ మాత్రమే వేయడం కాదు.. ప్రయివేటు స్కూళ్లకు దీటుగా ఉండేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం పాఠశాల్లో కూడా ఇంగ్లీష్ మీడియం అందిస్తోందని అన్నారు.
ఒకటి నుంచి 8 వరకు ఇంగ్లీస్ మీడియం ఉంటుందని… ఇప్పటికే టీచర్లకు ట్రెయినింగ్ ఇచ్చామని అన్నారు. ద్విభాషల్లో పుస్తకాలను ముద్రిస్తున్నామని వెల్లడించారు. ఇబ్బందులు పడుతూ తల్లిదండ్రులు విద్యార్థులను ప్రయివేట్ బడులకు పంపొద్దని అన్నారు. తల్లిదండ్రులు కూడా స్కూళ్లను విజిట్ చేయాలని… పిల్లలు ఏం చదువుతున్నారో తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అధికారులు పాల్గొన్నారు.