స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం పుష్ప ఈ సినిమా మొదటి భాగం మంచి విజయాన్ని అందుకున్న సంగతి అందరికి తెలిసిందే. తెలుగులో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పలు భాషలలో విడుదల చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక రంగస్థలం సినిమాతో సుకుమార్ తన మార్కును చాటుకొని పుష్ప సినిమాని తెరకెక్కించారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మించారు. దీంతో పుష్ప-2 చిత్రాన్ని మొదటి భాగం కంటే పెద్ద స్థాయిలో ఈ సినిమాని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నట్లు గా టాక్ వినిపిస్తోంది.
ఇక పార్ట్-1 నుంచి బడ్జెట్ను అత్యధికంగా భారీ యాక్షన్ తో తెరకెక్కించబోతున్న ట్లుగా వినిపిస్తోంది. పుష్ప ది రైజ్ తర్వాత డైరెక్టర్ సుకుమార్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది.. దీంతో క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్.. పుష్ప-1 కి రూ.18 కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్నాడు.. ఇక దీంతో ఇప్పుడు ఈ సీక్వెల్ కోసం దాదాపుగా రూ.40 కోట్ల రూపాయలు తీసుకోబోతున్నారు అని వారితో బాగా వినిపిస్తోంది. మరి ఈ రెమ్యూనరేషన్ తో భారతీయ సినిమా పరిశ్రమలో అత్యధిక పారితోషికం అందుకుంటున్న దర్శకుల జాబితాలో సుకుమార్ కూడా చేరిపోయాడని చెప్పవచ్చు
పుష్ప చిత్రం మొదటి భాగం మంచి విజయం సాధించడంతో తన కష్టం, తన టెక్నీషియన్స్ పడ్డ కష్టానికి వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. పుష్ప-2 లో అల్లు అర్జున్ మరోక డబల్ యాక్షన్ ఉంటుందని చెప్పవచ్చు. మొదటి భాగం పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ బాగా అలరించగా శ్రీవల్లి పాత్రలో రష్మిక అద్భుతంగా నటించింది. ఇక ఇందులో అనసూయ భరద్వాజ్, ప్రకాష్ రాజ్, కమెడియన్ సునీల్ నటించారు. ప్రస్తుతం పుష్ప-2 ఆగస్టు 2022 లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉన్నది.