బాలీవుడ్ సినిమాలపై సోను సూద్ సంచలన వ్యాఖ్యలు

-

బాలీవుడ్ సినిమాల పై సంచలన వ్యాఖ్యలు చేశారు సోనూసూద్. సౌత్ సినిమాలను ఆకాశానికి ఎత్తుతూ.. హిందీ సినిమాల పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో చెత్త సినిమాలు చేయకుండా సౌత్ సినిమాలు తనని కాపాడినట్టు తెలిపారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల ఆచార్య లో విలన్ గా మెరిసిన సోనుసూద్ ప్రస్తుతం హిందీలో పృధ్విరాజ్ చిత్రంలో నటించారు. ఇందులో ఆయన చాంద్ బర్దాయి పాత్రలో కనిపించబోతున్నారు.

తాను హిందీతో పాటు సౌత్ లోనూ నటించానని, ఒకానొక సమయంలో బాలీవుడ్ ని వదిలేసి దక్షిణాది సినిమాలు మాత్రమే చేశానని తెలిపారు సోనూ సూద్. అప్పట్లో అందరూ తనని సౌత్ లో ఎందుకు సినిమాలు చేస్తున్నావని ప్రశ్నించే వారని, అనుభవం కోసం చేస్తున్నా అని చెప్పినట్లు తెలిపారు. ప్రజలు సినిమా బాగా ఉంటేనే ఆదరిస్తారని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news