ఏపీలో పశువుల దాణా కుంభకోణం తరహాలో ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడుతోంది: ధూళిపాల నరేంద్ర

-

ఏపీలో పశువుల దాణా కుంభకోణం తరహాలో ప్రభుత్వం భారీ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు టిడిపి సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర. ఆర్బికేల ద్వారా వల్లభ ఫీడ్ ను అమ్ముతున్నారని, వల్లభ ఫీడ్స్ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ది కాదా? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కమీషన్ల కోసం కక్కుర్తి పడి మూగజీవాల పేరుతో భారీ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.ఫెర్టైల్ గ్రీన్ అనే కంపెనీ ద్వారా పశువుల మేత కోసం వినియోగించే టీఎంఆర్ ను మెట్రిక్ టన్ను రూ.16 వేలకు కొనుగోలు చేయాలని రైతుల పై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.

వెటర్నరీ డాక్టర్లకు టార్గెట్ పెట్టి మరి ఫర్టైన్ గ్రీన్ కంపెనీ సరఫరా చేసే మేతను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజలు ఎప్పుడూ చూడని నరకాన్ని గత మూడేళ్లలో జగన్ ప్రభుత్వం చూపిస్తోందని దుయ్యబట్టారు. గడిచిన మూడేళ్లలో ప్రత్యేక హోదా సాధన కు జగన్ ఏం చేశారని ప్రశ్నించారు. జగన్ సీఎం అయ్యాక ఎరువులు, విత్తనాల ధరలు పెరిగాయి కానీ రైతులు అమ్ముకునే ధాన్యం ధర పెరగలేదని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news