నీళ్లు, నిధులు, నియమకాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్. కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నాడు. నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ను త్వరలోనే ఇంటికి పంపుతారని అన్నారు. ఏ విషయం ప్రభుత్వంతో చెప్పుకోవడనాకి, పరిష్కరించుకోవడానికి అవకాశం లేకుండా పోయిందని ఆయన అన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే చాలు సెక్షన్ 144, సెక్షన్ 30 పెట్టి నిర్భంధాన్ని విధిస్తున్నారని అన్నారు. ఆఖరుకు ధర్నా చౌక్ లో నిరసనలకు పర్మిషన్ కూడా ఇవ్వడం లేకుండా ఉందని.. కోర్టుల జోక్యంతో ధర్నా చౌక్ సాధించుకున్నామని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయం మొక్కుబడిగా సాగుతోందని విమర్శించారు. ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని డెవలప్ చేయడంతో పాటు ఆ ఫలాలను ప్రజలకు అందించాలని అన్నారు. తెలంగాణ ఏర్పడేదాకా ఓ పోరాటం చేశామని.. తెలంగాణ ఏర్పడిన తర్వాత మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు.
కేసీఆర్ నియంత… త్వరలోనే జనాలు ఇంటికి పంపిస్తారు: ప్రొ. కోదండరామ్
-