బిజినెస్ ఐడియా:కుందేళ్లు పెంపకంతో లక్షల్లో ఆదాయం..పూర్తీ వివరాలు..

-

బిజినెస్ చేయాలనే కోరిక మీకు ఉందా? అయితే ఎలాంటి బిజినెస్ చేస్తే మంచి లాభాలు వస్తాయో..ఇప్పుడు చుద్దాము..మీకోసం ఓ బిజినెస్ ఐడియా ఉంది. అదే కుందేళ్ల పెంపకం..వీటి మాంసంకు మంచి డిమాండ్ కూడా ఉంది..అందుకే ఇప్పుడు చాలా మంది వీటిని పెంచాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ కుందేళ్ల పెంపకం కు ఎంత ఖర్చు అవుతుంది.ఎలా పెంచితే మంచి డిమాండ్ ఉంటుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

 

ఓ యువతికి ఆరోగ్యం పై వచ్చిన ఆలోచన ఇప్పుడు వ్యాపారంగా మారింది..లక్షల్లో ఆదాయాన్ని పొందుతుంది.సంగారెడ్డి కి చెందిన యువతి రెండు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టింది. తన సక్సెస్ ను తానే వివరించింది.కుందేళ్ల పెంపకానికి తగ్గట్టుగా ఇనుప కేజ్​లు ఏర్పాటు చేశాను. 4 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పు. కుందేళ్ల ప్రెగ్నెన్సీ పీరియడ్​ 28 నుంచి 30 రోజులు. క్రాస్ చేసిన నెల రోజులకి పిల్లల్ని పెడతాయి. ఒక కాన్పులో రెండు నుంచి పన్నెండు పిల్లల్ని పెడతాయి. ఇప్పుడు మా ఫామ్​లో పిల్లలు, పెద్దవి కలిపి ఐదొందల కుందేళ్లు ఉన్నాయి.

అంగోరా, న్యూజిలాండ్ వైట్, చించిల్లా, కాలిఫోర్నియా, డచ్​, ఇంగ్లీషు స్పాట్, సిన్నమిన్, బ్లాక్ జెయింట్, ఫ్లెమిష్ జెయింట్.. అనే తొమ్మిది​ రకాల కుందేళ్లను పెంచుతున్నారు.పొద్దున పది గంటలకు, సాయంత్రం నాలుగ్గంటలకు గడ్డి వేస్తాం. ఈ గడ్డిలో సూపర్, స్మార్ట్, ఆల్ఫా ఆల్ఫా, హెడ్జ్​ల్యూసెన్​ అని నాలుగు రకాలు ఉంటాయి. నిపుల్ సిస్టం ద్వారా నీళ్లు పెడుతున్నా. కుందేళ్లు 45 రోజుల్లో కిలోన్నర బరువు వరకు పెరుగుతాయి. వీటి కూర నారనారగా, ముదిరినట్టు ఉండదు. అంతేకాదు రెడ్​మీట్, చికెన్, మటన్​లో లాగా కుందేలు మాంసంలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండవు. ఇది వైట్​మీట్​ కాబట్టి దీన్ని పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ తినొచ్చు. త్వరగా అరుగుతుంది కూడా. ఇందులో ఐరన్, ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుండెజబ్బులు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు కూడా వీటిని తినవచ్చు..

మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ..రూ.850 నుంచి 900 రూపాయ లకు కుందేలు మాంసం దొరుకుతోంది. నేను మాత్రం రూ.800 లకు కిలో అమ్ముతున్నా. లైవ్​ ర్యాబిట్ అయితే రూ.700. ఒక యూనిట్ బ్రీడర్స్​ని 12 నుంచి 15 వేల రూపాయలకు ఇస్తున్నా. రెండు బన్నీస్​ కావాలంటే వెయ్యి నుంచి పన్నెండొందలు. హోటళ్లు, రెస్టారెంట్ల వాళ్లతో అగ్రిమెంట్ చేసుకోవాలి అనుకుంటున్నా. కుందేళ్లని ల్యాబొరేటరీస్​కు కూడా ఇవ్వాలనే ఆలోచన ఉంది. ఇప్పటివరకైతే మాంసం, బన్నీస్​ అమ్మి నెలకు దాదాపు లక్ష రూపాయల వరకు సంపాదిస్తున్నా… అందులో కూలీల ఖర్చు, ఇతర ఖర్చులు పోగా 50 వేలు నెలకు మిగులుతున్నాయి..ఈ బిజినెస్ చేయడం చాలా ఈజి అని ఆ అమ్మాయి చెప్పుకొచ్చింది..

 

Read more RELATED
Recommended to you

Latest news