కొన్ని నదులు, కొండలలో బంగారం నిక్షేపాలు ఉన్నా కూడా వాటిని బయటకు తీయ్యలేని పరిస్థితి..అలాంటి నదులలో ఒకటి ఉత్తరం భారతదేశంలో ఉంది.. ఆ సరస్సు గురించి పూర్తీ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
హిమాచల్ ప్రదేశ్లో ఉన్న మిస్టీరియస్ సరస్సులో కోట్లు విలువ చేసే నిధి ఉన్న.. ఎటువంటి సెక్యురిటీ ఉండదు. ఐనా ఆ నిధిని ఎత్తుకెళ్లడానికి ఎవ్వరూ సాహసించరు. ఎంతటి కరడుగట్టిన దొంగలైనా నిధివైపు కన్నెత్తైనా చూడరు..అంటే ఇదేదో ఊహించి చెప్పిన కథ కాదు. నిజంగానే ఆ సరస్సు ఉంది..దాని గురించి పూర్తీ విషయాలు మీ కోసం..హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీలోయలో ఉన్న మూడో ప్రధాన సరస్సుగా పేరుగాంచినది కమ్రునాగ్ సరస్సు. మండి జిల్లా నుంచి 60 కి.మీ దూరంలో రోహండా దట్టమైన అడవుల్లో ఈ సరస్సు ఉంది. ఈ సరస్సులోనే కోట్ల విలువచేసే నిధి దాగి ఉంది. ఇక్కడ ఇంత నిధి ఉన్నప్పటికీ దానిని బయటకు తీయడానికి మాత్రం ఎవరూ ఎందుకు సాహసించరు.
ఈ సరస్సు బయట ఒక ప్రముఖ దేవాలయం కూడా ఉంది.అక్కడకు వచ్చే భక్తులు ఈ సరస్సులో బంగారు, వెండి, వజ్రాభరణాలు, డబ్బు వేయడమనే ఆచారం శతాబ్ధాలుగా సంప్రదాయంగా ఆచరిస్తున్నారు. ఈ సంప్రదాయం మూలంగానే ఈ సరస్సులో బిలియన్ల నిధి ఉండిపోయింది.ఇకపోతే ప్రతి ఏడాది అక్కడ జూన్ 14-15 తేదీలలో జాతరను కూడా నిర్వహిస్తారు.లక్షలాది మంది భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించుకుని తమ మొక్కులను చెల్లించుకుంటారు.ఈ నిధి మొత్తం దేవతలకు చెందిన నిధి అని ఎవ్వరూ ముట్టుకోరు.
ఈ నిధికి రక్షణగా ఓ పాము కూడా ఉందని, అదే అక్కడి నిధికి కాపలాగా ఉంటుందని స్థానికులు చెబుతుంటారు. ఈ నిధిని ఎవరు బయటికి తీయాలని ప్రయత్నించినా పాము వాళ్ల ప్రాణాలను కభలిస్తుందనేది వాళ్ల నమ్మకం. అంతేకాకుండా ఈ సరస్సు నేరుగా పాతాళానికి వెళ్తుందని, అందుకే ఎవ్వరూ దీనిలోపలికి దిగే సాహసం చెయ్యరని చెబుతుంటారు. అక్కడికి వచ్చిన భక్తులు తమ కోరికలు తీరాక మొక్కుబడులు చెల్లించుకోవడానికి వచ్చి, సరస్సులో బంగారు, వెండి ఆభరణాలను సమర్పించి వెనక్కి తిరిగి చూడకుండా వస్తారట..ఈరోజుల్లో కూడా ఇలాంటి నమ్మకాలు ఉండటం ఏంటో..