త్వరలోనే నెక్లెస్ రోడ్డులోని నీరా కేఫ్ ను అందుబాటులోకి తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

హైదరాబాద్ నక్లెస్ రోడ్డులో 10 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న నీరా కేఫ్ ను ఆగస్టులో అందుబాటులోకి తెస్తామని అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గత పాలకులు ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులను నిర్లక్ష్యం చేశారని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గీత కార్మికుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్య ప్రదాయిని నీరాను.. ప్రజల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దివ్యౌషధంగా అందించాలనే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా నీరా కేఫ్ ను ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో సుమారు 10 కోట్ల రూపాయలతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నీరా కేఫ్ పనులను మంత్రి పరిశీలించారు. నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయాలని టూరిజం ఎండి మనోహర్ ని మంత్రి ఆదేశించారు. నీరు సహా అనుబంధ ఉత్పత్తుల తయారీ యూనిట్లను వేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం ఎండి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news