తెలుగు రాష్ట్రాల సీఎంలపై కే.ఏ.పాల్ సంచలన వ్యాఖ్యలు

-

తనను చంపేస్తామని బెదిరింపు కాల్స్ వచ్చాయని, 10 మంది తెలంగాణ ఎమ్మెల్యేలపై కేసు పెట్టానని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. తాను వేసిన కేసులను విత్ డ్రా చేసుకోవాలని ఒక కీలక నేత బెదిరిస్తున్నారని, ఇప్పటి వరకూ తనను బెదిరించిన వాళ్లే పోయారే తప్ప తనకేమీ కాలేదన్నారు. ప్రజలకు మంచి చేయాలని వచ్చిన తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు తనకు ఉన్న సెక్యూరిటీని కూడా తొలగించుకున్నానన్న పాల్.. ఇకపై తనకు దేవుడే సెక్యూరిటీ అన్నారు. తనపై కుట్ర పన్నిన వారు కలలో కూడా బాగుపడరని శపించారు. చంపాలని కుట్ర చేస్తున్నవారు కచ్చితంగా చనిపోతారని జోస్యం చెప్పారు.

గ్రూప్-1 విద్యార్థుల డిమాండ్ ను కేఏ పాల్ సమర్థించారు. పరీక్షల వాయిదాపై సుప్రీంకోర్టుకెక్కిన
వాళ్లకు.. నెల, రెండు నెలలు సమయం ఇస్తే తప్పేంటని తెలంగాణ సర్కారును ప్రశ్నించారు.
హర్యానాలో కాంగ్రెస్ 7 హామీలిచ్చినా ప్రజలు నమ్మలేదని, అందుకే ఓడిపోయిందన్నారు. తెలంగాణ,
కర్ణాటకల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికల ముందిచ్చిన హామీలను ఇంతవరకూ నెరవేర్చలేదన్నారు.
తాను సీఎం రేవంత్ రెడ్డితో ఉంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు. ఆయన సౌత్ కొరియాకు
వెళ్లి కూడా టూరిస్ట్ గా తిరిగివచ్చాడే తప్ప.. రాష్ట్రానికి ఏ మేలు చేయలేదన్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు చేశారు. ఏపీలో మంత్రులు, మాజీ మంత్రులు లిక్కర్ వ్యాపారంలో వాటాలు అడుగుతున్నారని.. అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news