ఎమోషనల్ అవుతూ లేఖ పోస్ట్ చేసిన కీర్తి సురేష్..ఏముందంటే..?

-

మహానటి కీర్తిసురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేను శైలజ అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కీర్తి సురేష్.. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాలలో నటించి..స్టార్ హీరోయిన్ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఇకపోతే తెలుగులో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఒక పెద్దగా గుర్తింపు రాలేదు తర్వాత ఒక మంచి సూపర్ హిట్ కోసం ఎదురుచూసి మహానటి సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది.అయితే ఏ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని చేకూర్చలేదు.

తమిళ్ లో కూడా కొన్ని సినిమాలు చేసి కొంత వరకు విజయం అయిందని చెప్పాలి. తర్వాత ఓర్పుతో వరుస సినిమాలు చేసుకుంటూ వచ్చిన కీర్తి సురేష్ ప్రస్తుతం ఈమె చేసిన సినిమాలు చేసి బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకుంది. అయితే రెండు సినిమాలు కూడా రెండు డిఫరెంట్ ఇండస్ట్రీస్ లలో విజయాలు దక్కడం గమనార్హం. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా తో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది కీర్తిసురేష్. ఇదిలా ఉండగా ఆనందంతో ఎమోషనల్ అయిన కీర్తి సురేష్ ఒక సుదీర్ఘమైన లేఖను రాసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ని రాసుకొచ్చింది.. కీర్తి సురేష్ తమిళ్ లో నటించిన సాని కాయిదం, తెలుగులో నటించిన సర్కారు వారి పాట రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇక అదే క్రమంలో తన టీం లకు ధన్యవాదాలు కూడా తెలిపింది.

ఇకపోతే కీర్తి సురేష్ షేర్ చేసిన పోస్ట్ లో ఇలా వుంది.. ప్రియమైన వారందరికీ నా మాట ఇది. నటి గా ఉండడం అనేది హానికర ఎగుడు దిగుడు ప్రయాణం లాంటిది. మనం ఎన్నో ఎత్తులు పల్లాలను చూస్తాము కానీ ఈ ప్రయాణం తరుచుగా మన గమ్యాన్ని నిర్ణయిస్తుంది. ఇటీవలి గతం నాకు పెట్టిన పరీక్ష సమయం లాంటిది. ఇది ఒక దశ.. ప్రపంచానికి తమ ప్రదర్శనను అందించడానికి నేను నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది అని నాకు అర్థం అయింది.. అంటూ ఆమె ఒక ఎమోషనల్ నోటు రాసుకొచ్చింది. ప్రస్తుతం ఇది కాస్తా వైరల్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news