మైనర్‌ బాలిక రేప్‌.. జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తత..

-

హైదరాబాద్‌లోని ఆమ్నేషియా ప‌బ్‌లో చోటుచేసుకున్న గ్యాంగ్ రేప్ నిందితుల‌ను అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ బీజేపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద సంఖ్య‌లో జూబ్లీహిల్స్‌ పోలీస్ స్టేష‌న్ వ‌ద్ద‌కు చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా పోలీసు సిబ్బందిని ప‌క్కకు తోసేసి బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేష‌న్‌లోకి దూసుకెళ్లారు. ఒక్క‌సారిగా వంద‌లాది మంది బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేష‌న్‌లోని దూసుకురావడంతో జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Jubilee hills police station - Latest News in Telugu, Photos, Videos, Today  Telugu News on Jubilee hills police station | SakshiJubilee hills police station - Latest News in Telugu, Photos, Videos, Today  Telugu News on Jubilee hills police station | Sakshi

ఇదిలా ఉంటే.. గ్యాంగ్ రేప్‌లో రాష్ట్ర హోం శాఖ మంత్రి మ‌న‌వ‌డే కీల‌క నిందితుడ‌ని బీజేపీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు ఆరోపించారు. నిందితుడు హోం మంత్రి మ‌న‌వ‌డు కావ‌డంతో అత‌డిపై కేసు న‌మోదు చేసేందుకు పోలీసులు వెనుకాడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఇక పోలీస్ స్టేష‌న్ వద్ద‌కు వ‌చ్చిన బీజేపీ శ్రేణుల‌కు నేతృత్వం వ‌హించిన మాజీ ఎమ్మెల్యే చింత‌ల రామ‌చంద్రారెడ్డి కూడా ఇదే త‌ర‌హా ఆరోప‌ణ‌లు చేశారు. త‌క్ష‌ణ‌మే నిందితుల‌ను అరెస్ట్ చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు రఘునందన్‌రావు.

Read more RELATED
Recommended to you

Latest news