హైదరాబాద్‌లోని ఆమ్నేషియా పబ్ లో బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనకు సంబంధించి పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ
ఘటనపై కేసు నమోదు చేసిన జూబ్లీ హిల్స్ పోలీసులు నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. అయితే.. ఈ కేసులో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసివుల్లా ఖాన్ కుమారుడు మహ్మద్ ఖాదర్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ ఖాదర్ ఖాన్‌తో పాటు మరో మైనర్ బాలుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
ఈ కేసులో నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ శ్రేణులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగిన సంగతి
తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు పోలీస్ స్టేషన్‌లోకి దూసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే అప్పటికే కేసుపై దృష్టి సారించిన పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ కేసులో నిందితుడిగా అనుమానిస్తున్న మహ్మద్ ఖాదర్ ఖాన్ హైదరాబాద్ శివారులో ఉన్నట్లు గుర్తించి అతడితో పాటు మరో మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.