టాలీవుడ్ యంగ్ హీరో సంతోశ్ శోభన్..విభిన్నమైన కథలను ఎంచుకుని సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ‘పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, మంచి రోచులొచ్చాయి’ వంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయ్యాయి. కాగా, ఇందులో ‘ఏక్ మినీ కథ’ అమెజాన్ ప్రైమ్ OTT వేదికగా విడుడలైంది. బోల్డ్ స్టోరితో ఇందులో చక్కటి పర్ఫార్మెన్స్ కనబరిచాడు హీరో సంతోశ్.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన ‘ఏక్ మినీ కథ’ పిక్చర్‌కు ఓటీటీలో విశేష ఆదరణ లభించింది. కాగా, వీరిరువురి కాంబోలోనే మరో ఫిల్మ్ రాబోతున్నదని తెలుస్తోంది. ఈ పిక్చర్ కు డిఫరెంట్ టైటిల్ పెట్టారట. ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని టాక్.
యూవీ కాన్సెప్ట్స్ ఈ పిక్చర్ ను ప్రొడ్యూస్ చేస్తోంది. ఇందులో సంతోశ్ శోభన్ యూట్యూబర్ గా కనిపించనున్నారట. సోషల్ మీడియాపైన సెటైరికల్ గా ఈ సినిమా స్టోరి ఉండబోతున్నదని టాక్. త్వరలో ఈ పిక్చర్ కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందట.